Good days for Coconut farmers in East and West Godavari districts, North andhra Districts because Malayalis in Kerala concentrate on Rubber plantation and Production decrease in Tamilnadu. <br />కొబ్బరి రైతుకు పండగల సీజన్ కలిసొచ్చింది. మరో 15 రోజుల్లో దీపావళి పండుగ. ఈ పండుగ సందర్భంగా వ్యాపార, వాణిజ్య వర్గాలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న దుకాణాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల నిర్వహణలో కొబ్బరి కాయలు కీలకం. గతంతో పోలిస్తే కేరళలో రబ్బర్ సాగుపై పెరిగిన ఆసక్తి, పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ దిగుబడి తగ్గడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు మంచి రోజులు వచ్చాయి.